టెలికాం దిగ్గజ సంస్థలు ఎయిర్టెల్(airtel recharge), ఐడియా, రిలయన్స్ జియో.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచి.. యూజర్లకు భారీ షాకిచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్ ప్యాక్‌లు, మొబైల్ డేటా రీఛార్జ్‌ల ధరలను 20-25 శాతం పెంచాయి.
అన్ని నెట్‌వర్క్‌లూ ఛార్జీలు పెంచాయ్.. మరి ఏది బెటర్? - jio new tariff plans
టెలికాం సంస్థలన్నీ మూకుమ్మడిగా ఛార్జీలను పెంచేశాయి. డేటా వినియోగానికి అలవాటు పడ్డ వినియోగదారులకు ఇది పెద్ద షాకింగ్ వార్తే. అయితే, పెంచిన తర్వాత ఏ నెట్వర్క్ టారిఫ్ రేట్లు ఎలా ఉన్నాయి? అందులో ఏది బెటర్?
తొలుత ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలను నవంబరు 26 నుంచి అమలు చేస్తోంది. ఆ వెంటనే వొడాఫోన్ ఐడియా కూడా రీఛార్జ్ ధరలను పెంచిన ధరలను నవంబరు 25 నుంచి అమలు చేస్తోంది. దేశంలో అతిపెద్ద టెలికాం రిలయన్స్ జియో.. తానేమి తక్కువ కాదంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా బాటలో పయనించింది. పెంచిన ధరలను డిసెంబరు 1 నుంచి అమలు చేయనుంది. మొత్తంమీద, టెలికాం ప్రొవైడర్ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో 20 నుంచి 25 శాతం పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థ టారీఫ్ రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఇదీ చదవండి:విదేశాలకు కొవాగ్జిన్ ఎగుమతి ప్రారంభం