కరోనా రెండో వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, దేశీయ విమాన ప్రయాణాలు (Domestic flights India) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలలో ప్యాసింజర్ల సామర్థ్యాన్ని (airlines passenger capacity) 72.5 శాతం నుంచి 85 శాతానికి పెంచింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry) ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను సవరించింది. ఇవి 15 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలిపింది. 16వ రోజు నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు ఛార్జీలు వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ నిబంధన 30 రోజులుగా ఉంది.