తెలంగాణ

telangana

ETV Bharat / business

జీవిత బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు పెంపు

జీవిత బీమా పాలసీదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ ఐఆర్​డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన గడవును మరో 30 రోజులపాటు పొడిగించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Life insurance policy holders get 30 more days to pay premium
'జీవిత బీమా' ప్రీమియం చెల్లింపునకు గడువు పెంపు

By

Published : Apr 6, 2020, 12:12 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ఉపశమనం కలిగిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన గడవును మరో 30 రోజులపాటు పొడిగించింది.

"మూడు వారాల లాక్​డౌన్, సామాజిక దూరం పాటింపు నిబంధనల కారణంగా పాలసీదారులు చాలా అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలసీదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని బీమా ప్రీమియం చెల్లింపునకు గడవును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం."

- ఐఆర్​డీఏఐ

వడ్డీ లేకుండా...

ఐఆర్​డీఏఐ నిర్ణయంతో.... మార్చి, ఏప్రిల్​ నెలల్లో బీమా ప్రీమియం చెల్లించాల్సిన వారికి పెద్ద ఉపశమనం కలిగినట్లైంది. 30 రోజుల అదనపు గ్రేస్ పీరియడ్​ తరువాత పాలసీదారులు ఎలాంటి వడ్డీ లేకుండానే ప్రీమియం చెల్లించవచ్చు.

యూనిట్​ - లింక్డ్​ పాలసీల మెచ్యూరిటీ, ఫండ్​ విలువను ఏక మొత్తంగా చెల్లించాల్సిన సందర్భాల్లో... బీమా కంపెనీలు సెటిల్​మెంట్​ ఎంపికలను అందించవచ్చని ఐఆర్​డీఏఐ పేర్కొంది. 2020 మే 31లోపు మెచ్యూరిటీ అయ్యే యూనిట్​-లింక్డ్​ పాలసీలకు మాత్రమే ఈ సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:చమురు ధరలు భారీగా పతనం- కారణమిదే...

ABOUT THE AUTHOR

...view details