లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేయనుంది. గతంలో పని దినంగా ఉన్న శనివారాన్ని కూడా సెలవుగా ప్రకటించడమే ఇందుకు కారణం.
ఎల్ఐసీ పని దినాలు ఇక వారంలో ఐదే!
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. ఇకపై వారానికి ఐదు రోజులే పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది.
ఎల్ఐసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
గత నెల 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఎల్ఐసీకి ప్రతి శనివారం సెలవు. ఈ నిబంధనల్ని ఈ నెల 10 నుంచి అమలు చేయనున్నట్టు బీమా సంస్థ ప్రకటించింది. తమ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం(ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు) వరకే పనిచేస్తాయని.. పాలసీదారులు, ఇతర వాటాదారులు ఈ రోజుల్లోనే తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఎల్ఐసీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:క్రెడిట్ కార్డులు ఎన్ని తీసుకుంటే మేలు..?
Last Updated : May 6, 2021, 2:30 PM IST