దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో పాలసీదారులకు ఊరట కలిగించింది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). కరోనా వ్యాప్తి కారణంగా సకాలంలో బీమా ప్రీమియం చెల్లించలేని పాలసీదారులకు గడువు పెంచింది. 2020, ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.
ఎల్ఐసీ బీమా ప్రీమియం చెల్లింపునకు గడుపు పెంపు
కరోనా కారణంగా సకాలంలో ప్రీమియం చెల్లించలేని పాలసీదారులకు ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించింది భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ). దేశవ్యాప్తంగా ఆంక్షలు విధిస్తున్న సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది సంస్థ.
ప్రీమియం చెల్లింపునకు ఎల్ఐసీ గడుపు పొడిగింపు
దేశంలో ఇప్పటి వరకు 341 మందికి వైరస్ సోకింది. ఈ నేపథ్యంలోవైరస్ వ్యాప్తి నియంత్రణకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశంలోని ప్రజలంతా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించారు.