దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌టీవీని విడుదల చేసింది. గేమింగ్, సినిమా, స్పోర్ట్స్ ప్రియులకు ప్రత్యేక అనుభూతినిచ్చేలా.. 'ఓఎల్ఈడీ48సీఎక్స్టీవీ' పేరుతో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. భారీ ఫీచర్లతో విడుదలైన ఈ మోడల్ ధరను రూ.1,99,990గా నిర్ణయించింది ఎల్జీ. దీని సైజు 122 సెంటీమీటర్లు.
ఫీచర్లు..
ఆల్ఫా 9 మూడో తరం ప్రాసెసర్ (ఎల్జీ సొంత ప్రాసెసర్)- ఏఐ ట్యూనింగ్, బ్యాలెన్స్డ్ సౌండ్ ఎఫెక్ట్స్ సరికొత్త హయర్ ఫ్రేమ్ రేట్, వేరియబుల్ రీఫ్రెష్ రేట్, ఆటోమేటిక్ లేటెన్సీ మోడ్ వంటివి ఈ ప్రాసెసర్ ప్రత్యేకత. గేమింగ్ అనుభూతిని రెట్టింపు చేసేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ ఎన్వీడియా జీ-సింక్ సాంకేతికతను ఈ టీవీలో పొందుపరిచింది ఎల్జీ.