- నేను మరో రెండేళ్లలో పదవీ విరమణ చేయబోతున్నాను. ఆ తర్వాత నెలకు కనీసం రూ.30,000 వరకూ వచ్చే ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. దీనికోసం రిటైర్ అయ్యేనాటికి నా దగ్గర ఎంత నిధి ఉండాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది?- ప్రవీణ్ కుమార్
రెండేళ్ల తర్వాత మీ పెట్టుబడిపై నెలకు కనీసం రూ.30వేలు రావాలంటే.. 6 శాతం రాబడి అంచనాతో రూ.60లక్షల నిధి ఉండాలి. అదే 7శాతం రాబడి వస్తే.. రూ.52లక్షలు అవసరం. 8శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే రూ.45 లక్షలు సరిపోతాయి. పదవీ విరమణ తర్వాత నష్ట భయం లేని పథకాలను ఎంచుకుంటే.. 6 శాతం వరకే రాబడి వచ్చే వీలుంది. అధిక రాబడి రావాలంటే.. మొత్తం పెట్టుబడిలో 75శాతం వరకూ సురక్షిత పథకాల్లోనూ.. 25 శాతం దాకా ఈక్విటీ ఆధారిత పథకాలకూ కేటాయించాలి. ఇలా చేయడం వల్ల సగటున 8శాతం వరకూ రాబడిని ఆర్జించే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి, సురక్షిత పథకాలు ఏవి ఎంచుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
- మా 12 ఏళ్ల అమ్మాయి పేరుతో ఒక మనీ బ్యాక్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నెలకు కనీసం రూ.10వేల వరకూ ప్రీమియం చెల్లించగలను. ఇది మంచి ఆలోచనేనా? - జ్యోతి
ముందుగా మీ అమ్మాయి భవిష్యత్ అవసరాలకు రక్షణ కల్పించేందుకు కుటుంబంలో ఆర్జించే వ్యక్తి వార్షికాదాయానికి 10-12 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ అమ్మాయి పేరుమీద మనీ బ్యాక్ పాలసీ తీసుకోవడం కన్నా.. రూ.10వేలను క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాల్లో మదుపు చేయండి. కాస్త నష్టభయం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మంచి రాబడికి ఆస్కారం ఉంటుంది. నెలకు రూ.10వేలను కనీసం ఏడేళ్లపాటు, 12 శాతం రాబడి అంచనాతో పెట్టుబడి పెడితే.. దాదాపు రూ.12,10,681 జమ అయ్యేందుకు అవకాశం ఉంది.
- నాలుగేళ్ల క్రితం ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఏక మొత్తంలో రూ.80,000 మదుపు చేశాను. ఇప్పటికీ ఆ ఫండ్‌లో పెద్దగా రాబడి కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ పన్ను మినహాయింపు కోసం ఆ మొత్తాన్ని తీసి, కొత్తగా వేరే ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చా? అందులోనే మరికొన్నాళ్లు కొనసాగాలా?- శేఖర్