భారత విపణిలోకి 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చిన తొలి స్వదేశీ సంస్థగా అరుదైన ఘనత సాధించింది లావా ఇంటర్నేషనల్. అగ్ని 5జీ(lava agni 5g) పేరుతో కొత్త మెబైల్‌ను విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ నొయిడాలోని సంస్థ ప్లాంట్‌లో దీన్ని తయారు చేసింది. భారత వినియోగదారులకు స్వదేశంలో రూపొందించిన 5జీ మొబైల్‌ను(lava agni 5g mobile) అందుబాటులోకి తీసుకురావాలనే అగ్నిని లాంచ్ చేసినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్తో 5జీ స్మార్ట్‌ఫోన్(lava 5g mobile) విడుదల చేసిన సంస్థల్లో ప్రపంచంలోనే తమది రెండో మొబైల్ కంపెనీ అని వెల్లడించింది.
అగ్ని ధర (lava agni 5g mobile price) రూ.19,999గా నిర్ణయించినట్లు లావా పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్‌ను శాసిస్తున్న చైనా మొబైల్ సంస్థలకు దీటుగా ఉండాలనే ఇంత తక్కువకు 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రీబుకింగ్ చేసుకునేవారికి ధర.. రూ.17,999 మాత్రమే అని తెలిపింది.
అగ్ని 5జీ ఫీచర్లు..
- గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.78 అంగుళాల డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్
- 8జీబీ రామ్, 128 జీబీ మెమొరీ
- 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా
- 16మెగాపిక్సెల్ ఫ్రంట్(సెల్ఫీ) కెమెరా
- 5000mAh బ్యాటరీ
- 30W సూపర్ ఫాస్ట్ ఛార్జర్