ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.583 మేర పెరిగింది. కేజీ వెండి రూ.1,300 లాభపడింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
- హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,851కి చేరింది.
- ఈ నగరాల్లో కేజీ వెండి ధర రూ.65,350గా ఉంది.
- స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1779 డాలర్లుగా నమోదైంది.
- స్పాట్ సిల్వర్ ధర 23.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.