తెలంగాణ

telangana

By

Published : Dec 31, 2020, 5:29 PM IST

ETV Bharat / business

కొత్త సంవత్సర కానుకగా ఈపీఎఫ్​ వడ్డీ జమ

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై నిర్ణయించిన 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందింది. ఈ నిర్ణయంతో ఆరు కోట్ల మంది సంఘటిత కార్మికుల ఖాతాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ జమ కానుంది.

Labour Min decides to notify 8.5pc interest on EPF for 2019-20, gets FinMin nod
కొత్తసంవత్సర కానుకగా ఈపీఎఫ్​ జమ

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఎఫ్​ఓ) 2019-20 ఆర్థిక సంవత్సరానికి.. 8.5 శాతం వడ్డీని ఒకే విడతలో జమ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆరు కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జనవరి 1 నుంచి వడ్డీ మొత్తాన్ని జమ చేస్తునట్లు కార్మికశాఖ అధికారులు తెలిపారు. ఇందుకు ఆర్థికశాఖ అనుమతి పొందినట్లు పేర్కొన్నారు.

జమ చేసిన మొత్తం జనవరి ఒకటో తేదీ నుంచి ఖాతాల్లో కనిపించనుంది. ఈ నెల 31న పదవీవిరమణ పొందే వారు కూడా ఇందుకు అర్హులు.

ఇదీ చూడండి: ఈపీఎఫ్​ ఖాతాల్లో ఈ నెలలోనే 8.5% వడ్డీ జమ!

ABOUT THE AUTHOR

...view details