తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈడీ ముందుకు కొచ్చర్​ - చందా కొచ్చర్​

ఐసీఐసీఐ- వీడియోకాన్​ అక్రమ రుణం కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఈడీ. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లకు అనుగుణంగా చందా కొచ్చర్​ విచారణకు హాజరయ్యారు.

ఐసీఐసీఐ- వీడియోకాన్​

By

Published : Mar 2, 2019, 10:35 AM IST

Updated : Mar 2, 2019, 1:04 PM IST

ఐసీఐసీఐ-వీడియోకాన్​ అక్రమ రుణ మంజూరు కేసులో పట్టు బిగిస్తోంది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. నేడు విచారణకు హాజరుకావాలంటూ ఐసీఐసీఐ బ్యాంక్​ మాజీ ప్రధాన కార్యనిర్వహణాధికారి చందాకొచ్చర్​, వీడియోకాన్​ ప్రతినిధి వేణుగోపాల్​కు సమన్లు జారీచేసింది. ఈడీ ఆదేశాల మేరకు కార్యాలయానికి భర్త దీపక్​ కొచ్చర్​తో కలిసి వచ్చారు చందా కొచ్చర్​.

శుక్రవారమే కొచ్చర్​, వేణుగోపాల్​ నివాసాలు సహా ముంబైలోని ఐదు కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ.

వీడియోకాన్​కు అక్రమ మార్గంలో రూ.1875 కోట్ల రుణాన్ని మంజూరు చేశారని ఆరోపిస్తూ చందాకొచ్చర్​, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​, వేణుగోపాల్​పై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు కోసమే శుక్రవారం ఈడీ సోదాలు జరిపింది.

ఇదీ చదవండి: కొచ్చర్​ ఇంట్లో సోదాలు..

విచారణకు వచ్చారు....
Last Updated : Mar 2, 2019, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details