కారు కొనకుండానే యజమాని అవ్వొచ్చు. లక్షలు ఖర్చు చేయకుండానే దర్జాగా కారులో తిరగొచ్చు. వింతగా, నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదూ! కానీ.. మారుతి సుజుకీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌తో ఇది సాధ్యమే.
ఈ పథకంతో మీరు ఎక్కడికైనా, ఎప్పుడైనా మీ 'సొంత కారు'లోనే వెళ్లొచ్చు. మారుతి వాహనాలైన వేగనార్, విటారా బ్రెజ్జా, స్విఫ్ట్, ఇగ్నిస్, బలీనో, సియాజ్, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 నచ్చినట్టు వినియోగించుకోవచ్చు.
నెలవారీ చెల్లింపులు..
మారుతి సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను గత ఏడాది జులైలో విడుదల చేశారు. ఈ ప్లాన్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. నెలవారీగా చెల్లింపులు చేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కారు నిర్వహణ, ఇన్సూరెన్స్‌తో పాటు ఇతర సేవలు కూడా నెలవారీ చెల్లింపుల్లోనే ఇమిడి ఉంటాయి. గడువు(24, 36, 48 నెలలు) ముగిసే సమయానికి సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాహనాన్నే అప్పటి మార్కెట్ ధరకు పూర్తిగా కొనుకోవచ్చు. లేదంటే మరో కారును సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్ట్రిప్షన్ను నిలిపివేసే ఆప్షన్ కూడా ఉంటుంది.