వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదంటే నమ్మశక్యం కాదు. చిన్న శబ్దం వచ్చినా సరే మెసేజ్ వచ్చిందేమోనని చాలా మంది చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడంతా వర్క్ ఫ్రం హోమ్, ఆన్‌లైన్ క్లాస్‌లు.. దీంతో వాట్సాప్ వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. అయితే.. భారీగా వచ్చే వాట్సాప్ నోటిఫికేషన్లతో చిరాకుగా ఉంటుందని పలువురు వాపోతుంటారు. మరి ఇలాంటి నోటిఫికేషన్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో రాకుండా, మళ్లీ కావాల్సినప్పుడు వచ్చేలా ఏం చేయాలో తెలుసుకుందాం.!
చాలా సింపుల్..
- ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
- నోటిఫికేషన్ సెక్షన్ క్లిక్ చేయాలి
- అందులో వాట్సాప్‌నకు ఎదురుగా ఉండే బాక్స్‌ను ఆఫ్ చేసేయండి
- నోటిఫికేషన్స్ రావాలంటే మళ్లీ సెట్టింగ్స్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సెక్షన్‌కు వెళ్లి వాట్సాప్‌ను ఎనేబుల్ చేసేయడమే..