కర్ణాటక రాజధాని బెంగళూరు పురపాలక సిబ్బందికి ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీపావళిని పురస్కరించుకుని బెంగళూరు పరిధిలోని 27వేల మంది పురపాలక సిబ్బందికి స్వీట్ బాక్సులను పండగ కానుకగా పంపించారు. పండగ రోజు వారి జీవితాల్లో సంతోషం నింపేందుకు మిఠాయిలు పంపించానని కిరణ్ మజుందార్ షా తెలిపారు.
వేలమందికి స్వీట్ బాక్సులు పంపిన మజుందార్ షా - CIVIC WORKERS
దీపావళి పండుగ రోజు పురపాలక సిబ్బంది జీవితాల్లో సంతోషం నింపే ప్రయత్నం చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా. వేలాది మందికి ఆమె.. స్వీట్ బాక్సులను కానుకగా పంపించారు.
![వేలమందికి స్వీట్ బాక్సులు పంపిన మజుందార్ షా kiran-mazumdar-shaw-surprises-civic-workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9547358-thumbnail-3x2-kiran.jpg)
వేలమందికి స్వీట్ బాక్సులు పంపిన మజుందార్ షా
బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీ, కొంతమంది వాలంటీర్ల సాయంతో షా ఈ కానుకలను సిబ్బందికి అందించారు. రాజానీనగర్ ప్రాంతంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేశ్‌కుమార్ స్వయంగా వెళ్లి మజుందార్ షా పంపించిన స్వీట్ బాక్సులను పురపాలక సిబ్బందికి అందజేశారు. కిరణ్ మజుందార్ షా అభిమానానికి పుర సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. అంతపెద్ద పారిశ్రామిక వేత్త తమను గుర్తుంచుకుని మిఠాయిలు పంపించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.