Kia Carens India: అతితక్కువ కాలంలోనే భారత్‌లో మంచి మార్కెట్ సంపాదించిన దక్షిణకొరియా ఆటోమొబైల్ సంస్థ కియా. ఇప్పటికే సెల్టోస్, సొనెట్, కార్నివల్‌ను మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ తాజాగా మరో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. రీక్రియేషనల్ వెహికిల్ (ఆర్వీ) మోడల్‌గా సంస్థ పేర్కొంటున్న ఈ సరికొత్త 'కారెన్స్'.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
బోల్డ్ డిజైన్, హైటెక్ ఫీచర్లు, ఇండస్ట్రీ లీడింగ్ సేఫ్టీ సిస్టమ్స్‌తో రూపొందించిన ఈ కియా కారెన్స్.. ఫ్యామిలీ వెహికిల్స్‌లో ప్రత్యేక స్థానం నెలకొల్పుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ సంస్థ సీఈఓ హో సుంగ్ సాంగ్. ఈ త్రీ రో సీటర్ కారులో.. ఎస్యూవీ-ఎంపీవీ మోడళ్ల వల్ల ఉండే లాభాలు ఉంటాయన్నారు.
ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరింయట్లలోనూ లభించనుంది. 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్లలో అందుబాటులోకి రానుంది.