Kia Carens 2022: దక్షిణ కొరియా వాహన సంస్థ కియా తమ సరికొత్త మోడల్ 'కరెన్స్'ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. కారు ఫీచర్లతో పాటు ధర వంటి వివరాలను మంగళవారం వెల్లడించింది. రిక్రియేషనల్ వెహికల్‌గా (ఆర్‌వీ) పేరొందిన ఈ కారు భారత్‌లో కియా నుంచి వస్తోన్న నాలుగో వాహనం. బుకింగ్స్ జనవరి 14 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
ధరల వివరాలు..
ట్రిమ్ ఆప్షన్స్: ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్.
ప్రీమియం నుంచి లగ్జరీ వరకు ఉన్న కార్లలో ఏడు సీట్లు ఉంటాయి. లగ్జరీ ప్లస్‌లో మాత్రం 6 సీట్లు లేదా 7 సీట్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
కియా కరెన్స్ రంగులు:మొత్తం 8 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. ఇంపీరియల్ బ్లూ, మోస్ బ్రౌన్, స్పార్ల్కింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పర్ల్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పర్ల్, క్రియర్ వైట్.
పరిమాణం:పొడవు-4,540 ఎం.ఎం, వెడల్పు- 1,800 ఎం.ఎం, ఎత్తు- 1,708 ఎం.ఎం, వీల్‌బేస్- 2,780 ఎం.ఎం
కరెన్స్ డిజైన్:కియా నుంచి ఇప్పటికే వచ్చిన సెల్టోస్, సొనెట్, కార్నివాల్‌తో పోలిస్తే కరెన్స్ డిజైన్ భిన్నంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పెద్ద ఎస్‌యూవీ తరహాలో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది. కియాకే సొంతమైన టైగర్-నోస్ గ్రిల్ డిజైన్‌ను ఇందులో మార్చారు. దీంట్లో కొత్తగా రేడియేటర్ గ్రిల్‌ను అమర్చారు. చివర్లో సన్నటి ఎల్‌ఈడీ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.
క్రోమ్ గార్నిష్డ్ డోర్ హ్యాండిల్స్, ఇండికేటర్ ఇంటిగ్రేటెడ్ వింగ్ మిర్రర్, స్పోర్టీ అలాయ్ వీల్స్, చంకీ బ్లాక్ బంపర్.. కియా కరెన్స్ డిజైన్‌లో చెప్పుకోదగ్గ హైలైట్స్.
కియా కరెన్స్ క్యాబిన్:క్యాబిన్‌ను సరిపడా స్థలంతో మరింత స్టైలిష్‌గా రూపొందించారు. కియా కనెక్ట్‌తో అనుసంధానం చేయగల 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్, ఎనిమిది స్పీకర్లతో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, స్మార్ట్ ఎయిర్‌ప్యూరిఫయర్, వైరస్, బ్యాక్టీరియా ప్రొటెక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్కైలైట్ సన్‌రూఫ్, ప్రీమియం లెదర్ సీట్లు క్యాబిన్‌ను అందంగా తీర్చిదిద్దాయి.
కియా కరెన్స్ పవర్‌ట్రెయిన్:1.5 లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.4 లీటర్ టీజీడీఐ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5 లీటర్ సీఆర్‌డీఐ వీజీటీ డీజిల్ యూనిట్‌తో మొత్తం మూడు పవర్‌ట్రెయిన్లతో కరెన్స్ వస్తోంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్‌మిషన్‌ను ఇచ్చారు.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6,300 ఆర్‌పీఎం వద్ద 115 పీఎస్ శక్తిని, 114 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. 1.4 లీటర్ ఇంజిన్, 6,000 ఆర్‌పీఎం వద్ద 140 పీఎస్ శక్తిని, 242 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 4,000 ఆర్‌పీఎం వద్ద 115 పీఎస్ శక్తిని, 250 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.
కరెన్స్ భద్రత: మొత్తం 10 భద్రతా ఫీచర్లతో కుటుంబం మొత్తానికి ఈ కారు రక్షణ కల్పించనుందని కియా తెలిపింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సీ, హెచ్‌ఏసీ, వీఎస్‌ఎం, డీబీసీ, బీఏఎస్, ఆల్-వీల్ బ్రేక్స్, టీపీఎంఎస్ హైలైన్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. ఇవి అన్ని కరెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉండడం విశేషం.
ఇదీ చూడండి:భారత్‌లో ఇక విద్యుత్ వాహనాలదే హవా!