స్టాక్మార్కెట్లో నైకా ఐపీఓ(nykaa ipo) అంచనాలను మించి విజయవంతమైంది. ఈ ఈ-కామర్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన, షేర్లు కలిగిన వారికి లాభాల పంట పండించింది. దీంతో సంస్థ యజమాని, సీఈఓ ఫాల్గుణ నాయర్ భారత్‌లో తొలి స్వతంత్ర మహిళా బిలియనీర్‌గా అవతరించారు. ఆమెతో పాటు ఈ సంస్థలో వాటాలు కలిగిన చాలా మంది భారీ లాభాలను ఆర్జించారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కత్రినా కైఫ్, ఆలియా భట్ గురించి. ఐపీఓకు(nykaa ipo 2021) ముందే నైకాలో పెట్టుబడులు పెట్టిన వీరిద్దరూ ఇప్పుడు 10 రెట్లకు పైగా లాభాలు గడించారు.
కత్రినా, ఆలియా ఎన్ని కోట్లు సంపాదించారంటే...
తన కాయ్ బ్యూటీ ఉత్పత్తులను నైకాలో(nykaa ipo news) లాంచ్ చేసిన ఏడాది తర్వాత ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టింది కత్రినా. ఈ బ్రాండ్ విజయవంతంగా వృద్ధి చెందాక మరింత ఆసక్తితో వాటాలు కొనుగోలు చేసింది. 2018లో రూ.2.02కోట్లతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది(katrina kaif nykaa investment). ప్రస్తుత వాటాతో పోల్చితే ఇది చాలా తక్కువ. మరో బాలీవుడ్ యువనటి ఆలియా భట్ నైకాపై(alia bhatt nykaa) కాస్త ఎక్కువ నమ్మకమే ఉంచింది. ఇందులో రూ.4.95కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు నైకా ఐపీఓ అత్యంత విజయవంతం కావడం వల్ల వీరిద్దరి వాటాల విలువ ఒక్క రోజులోనే 10 రెట్లుకు పైగా వృద్ధి చెందింది.