తెలంగాణ

telangana

ETV Bharat / business

విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ​ఇండియా

ఎయిర్​ ఇండియా శ్రీనగర్​-దిల్లీ మార్గంలో అమర్​నాథ్​ ప్రయాణికులకు విమాన ఛార్జీలు తగ్గించింది. తగ్గించిన ఈ ధరలు ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని ఆ సంస్థ తెలిపింది.

విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ​ఇండియా

By

Published : Aug 4, 2019, 3:53 PM IST

కశ్మీర్​లో ఉద్రిక్తతల నేపథ్యంలో స్వస్థలాలకు పయనమవుతున్న అమర్​నాథ్​ యాత్రికులకు ఊరటనిచ్చేలా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్​-దిల్లీ మార్గంలో విమానాల గరిష్ఠ ఛార్జీలను రూ.7000లకు తగ్గించింది.

"ఎయిర్ ఇండియా విమాన ఛార్జీలను రూ.9,500 నుంచి తగ్గించింది. శ్రీనగర్​- దిల్లీ మార్గంలో గరిష్ఠంగా రూ.6,715, దిల్లీ- శ్రీనగర్​ మార్గంలో గరిష్ఠంగా రూ.6,889కు ఛార్జీలను తగ్గించాం. తగ్గించిన ఈ ధరలు ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి."
- ఎయిర్​ ఇండియా అధికార ప్రతినిధి

ఇదీ నేపథ్యం

అమర్​నాథ్ యాత్రికులే లక్ష్యంగా పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాల సమాచారం. దీంతో యాత్రికులు వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేరుకోవాలని ప్రభుత్వం సూచించింది.

స్వస్థలాలకు చేరుకోవడానికి పయనమైన అమర్​నాథ్ యాత్రికుల కోసం విమాన ఛార్జీలు తగ్గించాలని పౌరవిమానయానశాఖ... విమానయాన సంస్థలకు సూచించింది. అవసరమైతే శ్రీనగర్ ఎయిర్​పోర్టు నుంచి అదనపు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించింది.

ఇదీ చూడండి: దుబాయ్​లో జాక్​పాట్​ కొట్టిన తెలుగోడు..​!

ABOUT THE AUTHOR

...view details