తెలంగాణ

telangana

ETV Bharat / business

'పాత కారు ఇస్తే కొత్త వాహనంపై 5 శాతం రాయితీ'

పాత కారు ఇస్తే కొత్త వాహనం ధరలో 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొత్త వాహనాలకు రాయితీ, పాత వాటిపై పర్యావరణ పన్ను, ఇతర సుంకాలు ఉంటాయని తెలిపారు.

GADKARI
'పాత కారు ఇస్తే కొత్త వాహనంపై 5 శాతం రాయితీ'

By

Published : Mar 8, 2021, 5:38 AM IST

వాహన వినియోగదారులకు కేంద్రం తీపికబురు అందించింది. వాహన తుక్కు విధానం కింద పాతకారు ఇస్తే కొత్త కారు కొనుగోలుకు 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2021-22 వార్షిక బడ్జెట్‌లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రకటించిన కేంద్రం... వ్యక్తిగత వాహనాలకు 20ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15ఏళ్ల తర్వాత తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.

కొత్త వాహనాలకు రాయితీ, పాత వాటిపై పర్యావరణ పన్ను, ఇతర సుంకాలు ఉంటాయని గడ్కరీ తెలిపారు. వాహనాలను తప్పనిసరిగా ఫిట్‌నెస్‌, కాలుష్య ధ్రువీకరణ పరీక్షలకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. మానవ ప్రమేయం లేకుండా కాలుష్య ధ్రువీకరణ పత్రాలను అందించే కేంద్రాలను దేశవ్యాప్తంగా నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details