తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​లో తగ్గిన ఉద్యోగ నియామకాలు!

దేశవ్యాప్తంగా ఏప్రిల్​లో ఉద్యోగ నియామకాలు 3 శాతం (మార్చితో పోలిస్తే) తగ్గాయి. గత ఏడాది ఏప్రిల్​తో పోలిస్తే 4 శాతం ఉద్యోగ నియామకాలు క్షీణించినట్లు ఓ నివేదికలో వెల్లడైంది. వివిధ నగరాల్లో ఉద్యోగ నియామకాలపై నివేదికలో తేలిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Covid impact on Jobs
ఉద్యోగాలపై కరోనా ప్రభావం

By

Published : May 13, 2021, 10:48 AM IST

కరోనా రెండో దశ ప్రభావం ఉద్యోగాలపై కూడా తీవ్రంగా పడింది. వివిధ రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించడం వల్ల ఉద్యోగ నియామకాలు ఏప్రిల్​లో (మార్చితో పోలిస్తే) 3 శాతం తగ్గినట్లు మాన్​స్టర్​ ఎంప్లాయ్​మెంట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఉద్యోగ నియామకాలు 4 శాతం తగ్గినట్లు పేర్కొంది.

ఉద్యోగ నియామకాలు తగ్గినప్పటికీ.. కొన్ని పరిశ్రమలు, పలు నగరాల్లో మాత్రం బలమైన వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది.

నివేదికలోని మరిన్ని వివరాలు..

  • 2020 ఏప్రిల్​తో పోలిస్తే గతనెల.. ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్​, పబ్లిక్​ రిలేషన్స్​ (పీఆర్​) వంటి ఉద్యోగాలు హైదరాబాద్​, చెన్నై వంటి నగరాల్లో 50 శాతానికిపైగా పెరిగాయి.
  • కోల్​కతాలో గత నెల బ్యాంకింగ్, బీమా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాలు 26 శాతం పుంజుకున్నాయి.
  • ఏప్రిల్​లో దేశవ్యాప్తంగా నియామకాలు తగ్గినా.. బెంగళూరు (28 శాతం), హైదరాబాద్​ (23 శాతం), చెన్నై (16 శాతం) వంటి నగరాల్లో నియామకాలు భారీగా పెరిగాయి.
  • ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఉక్కు, స్టీల్​, రిటైల్ ఎంఫ్​ఎంసీజీ, ఫుడ్​, ప్యాకేజ్​డ్​ ఫుడ్​ విభాగాల్లో నియామకాలు గణనీయంగా తగ్గాయి.
  • మీడియా, వినోదం వంటి రంగాల్లో మాత్రం ఉద్యోగాలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి.

ఇదీ చదవండి:ఆర్థిక రికవరీకి సవాళ్లు- ప్యాకేజీనే పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details