తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ కస్టమర్లే లక్ష్యంగా 'జియో పోస్ట్​పెయిడ్​ ప్లస్'​ - ఆ కస్టమర్లే లక్ష్యంగా 'జియో పోస్ట్​పెయిడ్​ ప్లస్'​

భారతీయ టెలికాం సంచలనం రిలయన్స్​ జియో మరో కొత్త ఆఫర్​ను ప్రకటించింది. పోస్ట్​పెయిడ్​ విభాగంలో పోటీదారులైన ఎయిర్​టెల్​, వొడాఫోన్​ -ఐడియా కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయోజనాలతో కూడిన 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' ను తీసుకొచ్చింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

jiopostpaid-plus-launched-to-take-on-airtel-vi
ఆ కస్టమర్లే లక్ష్యంగా 'జియో పోస్ట్​పెయిడ్​ ప్లస్'​

By

Published : Sep 22, 2020, 10:40 PM IST

భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియో మరో ఆకర్షణీయమైన ఆఫర్​ను ప్రకటించింది. పోస్ట్​పెయిడ్​ వినియోగదారులే లక్ష్యంగా 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' ప్లాన్​ను ప్రకటించారు సంస్థ డైరెక్టర్​ ఆకాశ్​ అంబానీ. కనెక్టివిటీ, వినోదం, అనుభూతి, ఉన్నతమైన సేవలు అందించేందుకు సరికొత్త ఆఫర్​ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' ఆఫర్లు ఇవే..

  • అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్​, డిస్నీ హాట్​స్టార్​ సబ్​స్క్రిప్షన్​తోపాటు ఫ్యామిలీ ప్లాన్​ కనెక్షన్​ను రూ. 250 చెల్లించి పొందవచ్చు.
  • 500జీబీ డేటా వరకు వినియోగించే అవకాశం ఉంటుంది.
  • వైఫై కాలింగ్​తో పాటు అంతర్జాతీయ సేవలకు సంబంధించి కూడా ప్రయోజనాలు పొందవచ్చు.
  • అరబ్ దేశాలు, అమెరికాలో ఉచితంగా అంతర్జాతీయ రోమింగ్ సదుపాయం
  • అంతర్జాతీయ కాల్స్​కు నిమిషానికి కేవలం 50 పైసలు చెల్లిస్తే సరిపోతుంది.
  • రూ.399, రూ. 599, రూ. 799, రూ. 999, రూ.1499 రేట్లలో ప్లాన్స్​ అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్​ను బట్టి సేవలు ఉంటాయని చెప్పుకొచ్చారు జియో డైరెక్టర్​ ఆకాశ్​ అంబానీ. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను ప్రవేశపెట్టడానికి మరింత సమయం వేచి ఉండకూదని నిర్ణయించుకొని ఇప్పుడు ప్రవేశపెట్టినట్లు వివరించారు.

"ప్రీపెయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో 400 మిలియన్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించిన తర్వాత ఇప్పుడు పోస్ట్​ పెయిడ్​ విభాగంలో విస్తరించాలనుకుంటున్నాము. ప్రతి పోస్ట్‌ పెయిడ్ కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్​ను రూపొందించాం."

- ఆకాశ్​ అంబానీ, జియో డైరెక్టర్​

ABOUT THE AUTHOR

...view details