తెలంగాణ

telangana

ETV Bharat / business

Jio Phone Next: జియోఫోన్‌ నెక్ట్స్‌ రిలీజ్​ ఎప్పుడు? ధర ఎంత? - business news latest

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియోఫోన్‌ నెక్ట్స్‌(Jio Phone Next) సెప్టెంబరు రెండో వారంలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. దీని ధరకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలయన్స్‌ జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దీని ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రీ-బుకింగ్స్​ ప్రారంభమయ్యే అవకాశలున్నాయని నెట్టింట వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

Jio Phone Next
జియోఫోన్‌ నెక్ట్స్‌ రిలీజ్​ ఎప్పుడు? ధరెంత?

By

Published : Aug 28, 2021, 7:44 AM IST

అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో రిలయన్స్‌ ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. గూగుల్‌తో కలిసి రూపొందించిన ఈ ఫోన్‌ను జియోఫోన్‌ నెక్ట్స్‌గా(Jio Phone Next) వ్యవహరిస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఫోన్‌ సెప్టెంబరు 10న విడుదల కానుంది!

ధర ఇదేనా?

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించనవిగా చెబుతున్న ఫీచర్లు కొన్ని(Jio Phone Next Features) ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా దీని ధరకు సంబంధించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రిలయన్స్‌ జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రానప్పటికీ.. దీని ధర(Jio Phone Next Cost) రూ.3,499గా ఉండే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ప్రీ-బుకింగ్స్‌ ఎప్పుడు?

వచ్చేవారమే ఈ ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌(Jio Phone Next Pre Bookings) ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు నెట్టింట వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే ఈ ఫోన్లు, దీనికి సంబంధించిన ఇతర పరికరాలు ఆఫ్‌లైన్ రీటైల్‌ సోర్లలోనూ అందుబాటులో ఉంచేందుకు రిలయన్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివో, షావోమీ, శాంసంగ్‌, ఒప్పో, హెచ్‌ఎండీ గ్లోబల్‌, ఐటెల్‌ సహా మరికొన్ని రీటైల్‌ సోర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఆయా సోర్లలో జియో మినీ పాయింట్‌ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రీటైలర్లకు కూడా కమిషన్‌ ఇస్తారని సమాచారం.

ఇదీ చూడండి:దేశాలకు క్రెడిట్​ రేటింగ్​ ఎలా ఇస్తారు? దాని అవసరం ఎంత?

ABOUT THE AUTHOR

...view details