తెలంగాణ

telangana

ETV Bharat / business

'గిగా ఫైబర్' జైత్రయాత్ర ప్రారంభం నేడే! - జియో 4జీ

రిలయన్స్ జియో.. మరో సంచలనానికి సిద్ధమైంది. జియో 4జీ తర్వాత.. ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన 'గిగా ఫైబర్' సేవలపై నేడు స్పష్టత రానుంది. నేడు జరగనున్న జియో మాతృసంస్థ రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో దీనిపై ప్రకటన వెలువడనుంది.

'గిగా ఫైబర్' జైత్రయాత్ర ప్రారంభం నేడే!

By

Published : Aug 12, 2019, 6:01 AM IST

Updated : Sep 26, 2019, 5:28 PM IST

జియో 4జీ.. తర్వాత మరో సంచలనానికి తెర తీయనుంది రిలయన్స్. అదే 'జియో గిగా ఫైబర్'​. డీటీహెచ్, టీవీ, ల్యాండ్​ లైన్ మూడు సేవలను ఒకే దగ్గర పొందే వీలుండటమే దీని ప్రత్యేకత. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత.. 'గిగా ఫైబర్'​ సేవల ప్రారంభంపై నేడు స్పష్టత రానుంది.

జియో మాతృ సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశం నేడు జరగనుంది. ఇందులో 'గిగా ఫైబర్' సేవల ప్రారంభంపై స్పష్టత ఇవ్వనుంది రిలయన్స్. జియో కొత్త ఫోన్, జియో ఈ కామర్స్ వ్యాపారంపైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

గత ఏడాది రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో 'గిగా ఫైబర్​'ను తీసుకు రానున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో 'గిగాఫైబర్' ట్రయల్స్ నిర్వహిస్తోంది రిలయన్స్. మొదట సంస్థ ఉద్యోగులపై ట్రయల్ నిర్వహించినా.. తర్వాత బీటా టెస్టింగ్ యూజర్లకు సేవలు విస్తరించింది.

చివరి దశకు ట్రయల్​

సంస్థ ఉద్యోగులు, బీటా యూజర్లపై నిర్వహిస్తోన్న 'గిగా ఫైబర్' సేవలు చివరి దశకు చేరుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే వెల్లడించారు. ఈ కారణంగా 'గిగా ఫైబర్' సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైందన్న సంకేతాలకు ఈ ప్రకటన ఊతమందించింది.

గిగా ఫైబర్ ప్రత్యేకతలు ఇవే..

జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, టీవీతో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌, డీటీహెచ్​ సేవలు అందించడం దీని ప్రత్యేకత. ల్యాండ్​లైన్ సేవల కారణంగా.. ప్రస్తుతం సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాలకూ కాలింగ్ సమస్య తీరనుంది. గ్రామాలకూ అంతర్జాల సేవలందించడం సులభం కానుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్, ల్యాండ్​లైన్​ సేవలు ఒకే కనెక్షన్​పై అందుబాటులో ఉన్నా.. టీవీ కోసం మరో కనెక్షన్​ తీసుకోక తప్పడం లేదు. జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే... మూడు సేవలు ఒకే కనెక్షన్​తో లభ్యం కానున్నాయి.

'గిగా ఫైబర్' అందుబాటులోకి వస్తే.. ఈ సేవలపై ప్రస్తుతం ఉన్న చార్జీల మోత తగ్గనుంది. జియో 4జీ రాకతో డేటా చార్జీలు దిగొచ్చినట్లే.. ఇతర సంస్థలూ తమ టారీఫ్​లను మార్చుకోవాల్సి వస్తోంది.

గిగా ఫైబర్ ప్లాన్​లు?

ట్రయల్ దశలో పలు పట్టణాల్లో రూ.4,500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్​తో 'గిగాఫైబర్' కనెక్షన్ ఇస్తోంది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​తో వినియోగదారులకు సేవలు అందిస్తోంది. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్ సేవలను పొందుతున్నారు. రూ.2,500తో మరో ప్లాన్​ను తెచ్చింది జియో. ఈ ప్లాన్​లో 50 ఎంబీపీఎస్ స్పీడ్​తో జియో గిగా ఫైబర్ సేవలను అందిస్తోంది.

ట్రిపుల్ ప్లే ప్లాన్​కు నెలవారీ చందా రూ.600 ఉండనున్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం రూ.1,000 నెలవారీ చందాతో మరో ప్లాన్​ను​ కూడా తీసుకురానుంది రిలయన్స్.

ఒక వేళ సేవలు వద్దనుకుంటే.. సెక్యూరిటీ డిపాజిట్​ను తిరిగి పొందేందుకు వీలుండనుంది.

ఇదీ చూడండి: ఆగస్ట్​ 15లోగా 2కోట్ల మందికి కిసాన్ మాన్​ధన్​

Last Updated : Sep 26, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details