వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. మే నెలకు గాను 20.7 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో 4జీ నెట్వర్క్ అందించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించింది. గతంలో కంటే ఈసారి మరింత వేగం నమోదైనట్లు పేర్కొంది. అయితే ఇదే రంగంలో ఉండే సమీప పోటీదారులైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌ల 4జీ నెట్‌వర్క్‌లతో వేగంతో పోల్చితే జియోది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
వొడాఫోన్ ఐడియా 6.3 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్‌తో రెండో వేగవంతమైన టెలికాం నెట్‌వర్క్‌గా నిలిచింది. ఎయిర్టెల్ డౌన్లోడ్ స్పీడ్ 4.7 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.
అప్‌లోడ్‌లో ఇలా..
అప్లోడ్ విషయంలో మాత్రం 6.7 ఎంబీపీఎస్ స్పీడ్‌తో వొడాఫోన్ ఐడియా అగ్రస్థానంలో నిలిచింది.