తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ. 990 కోట్లకు చేరిన రిలయన్స్​ జియో నికర లాభం - రిలయన్స్ జియో 2019-20 జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు విడుదల

రిలయన్స్ జియో 2019-20 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తమ కంపెనీ లాభం 45.4 శాతం పెరిగి రూ.990 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. ప్రస్తుతం 350 మిలియన్​ చందాదారులు తమకు ఉన్నారని, ప్రతి నెలా కోటి మందికిపైగా కొత్త చందాదారులను చేర్చుకుంటున్నామని స్పష్టం చేసింది. జియోను 'డిజిటల్ గేట్​ ఆఫ్ ఇండియా'గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్​ ముఖేశ్ అంబానీ అభివర్ణించారు.

45.4 శాతం పెరిగిన రిలయన్స్​ జియో నికర లాభం

By

Published : Oct 18, 2019, 8:26 PM IST

2019-20 జూలై-సెప్టెంబర్​ త్రైమాసికంలో తమ నికర లాభం 45.4 శాతం పెరిగి రూ.990 కోట్లకు చేరుకుందని టెలికాం ఆపరేటర్​ రిలయన్స్ జియో ప్రకటించింది. తమ చందాదారుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జియో నికర లాభం రూ.681 కోట్లుగా ఉంది.

కంపెనీ నిర్వహణ ఆదాయం 33.7 శాతం పెరిగి రూ.12,354 కోట్లకు చేరింది. 2018-19లో ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.9,240 కోట్లుగా ఉంది.

"ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సేవల సంస్థగా నిలిచే క్రమంలో జియో 350 మిలియన్​ చందాదారుల మార్కును దాటింది. ఇంకా ప్రతి నెలా 10 మిలియన్లకుపైగా కొత్త చందాదారులను చేర్చుకుంటున్నాం. జియో... చందాదారుల సంఖ్య, ఆదాయాల పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. అంతే కాదు డిజిటల్ గేట్​వే ఆఫ్ ఇండియా కూడా."

- ముఖేశ్ అంబానీ, రియలన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్​, మేనేజింగ్ డైరెక్టర్​

ఒక జియో వినియోగదారునిపై ఆదాయం రూ.120గా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే మునుపటి త్రైమాసికంతో పోల్చితే రూ.2 మేర ఈ ఆదాయం తగ్గిందని పేర్కొంది. ఈ లోటును పెరిగిన చందాదారుల సంఖ్య అధిగమించిందని జియో తెలిపింది.

జియో చందాదారుల సంఖ్య గత త్రైమాసికంతో పోల్చితే 33.3 కోట్ల నుంచి నేడు 35.52 కోట్లకు చేరుకుంది.

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థను మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారు'

ABOUT THE AUTHOR

...view details