తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో ఫోన్​ యూజర్లకు ఫ్రీ టాక్​టైమ్​ - జియో ఫోన్​ ఆఫర్లు

కరోనా మహమ్మారి నేపథ్యంలో రిలయన్స్​ సంస్థ జియోఫోన్​ వినియోగదారులకు ఫ్రీ టాక్​టైమ్​ ప్రకటించింది. నెలకు 300 నిమిషాల ఫ్రీ ఔట్​గోయింగ్​ కాల్స్​ను అందించనున్నామని తెలిపింది. ఈ ఆఫర్లు వార్షిక ప్లాన్లు, జియోఫోన్​ డివైస్​ బండల్డ్​ ప్లాన్స్​కు ​వర్తించవని స్పష్టం చేసింది.

jiophone new offers, జియో ఫోన్​ ఆఫర్లు
జియో ఫోన్​ ఆఫర్లు

By

Published : May 14, 2021, 2:23 PM IST

జియో ఫోన్​ వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్​గోయింగ్​ కాల్స్​ను అందించనున్నామని రిలయన్స్​ సంస్థ శుక్రవారం ప్రకటించింది. రోజుకు 10 నిమిషాల పాటు ఉచిత టాక్​టైమ్​ లభించే విధంగా ఉన్న ఈ ఆఫర్​ను ప్రకటించడానికి కరోనా మహమ్మారే కారణంగా తెలుస్తోంది. రీఛార్జ్​ చేసుకోలేని జియో ఫోన్​ వినియోగదారులకు ఈ ఆఫర్​ వర్తిస్తుందని రిలయన్స్​ తన ప్రకటనలో పేర్కొంది. ​

కరోనా రెండో దశ నేపథ్యంలో ఫ్రీ టాక్​టైమ్​ ప్రకటించిన తొలి సంస్థగా రిలయన్స్​ జియో నిలిచింది.

ఫ్రీ టాక్​టైమ్​తో పాటు జియో మరో ఆఫర్​ను ప్రకటించింది. వినియోగదారుడు రీఛార్జ్​ చేసుకునే ఏ జియోఫోన్​ ​ప్లాన్​కు అయినా అంతే విలువ చేసే రీఛార్జ్​ ప్లాన్​ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. మహమ్మారి తగ్గుముఖం పట్టేవరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయని.. అయితే ఈ ఆఫర్లు వార్షిక ప్లాన్లు, జియోఫోన్​ డివైస్​ బండల్డ్​ ప్లాన్స్​కు ​వర్తించవని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :స్పుత్నిక్ వి టీకా ధర రూ.995.40

ABOUT THE AUTHOR

...view details