స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జియో ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలుపై ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియో కాల్స్ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలంటే రూ.1,999తో జియో ఫైను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్లను కూడా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని జియో ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం జియో ఫై వినియోగదారుల కోసం మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.199తో రీఛార్జి చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో 1.5 జీబీ రోజువారీ డేటా, జియో నుంచి జియో అన్‌లిమిటెడ్ కాల్స్, 1000 వరకు జియో నుంచి ఇతర నెట్‌వర్కులకు కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. దీనికి రూ.99తో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే అదనంగా 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ జియో టు జియో కాల్స్, 1000 వరకూ ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్(ఆ తర్వాత నుంచి నిమిషానికి ఆరు పైసలు) 140 రోజుల పాటు లభిస్తాయి.