Jio Recharge Cashback Offers: డిసెంబర్ నుంచి ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు పెంచింది రిలయన్స్ జియో. ఈ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లపై 20 శాతం క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది. ఈ క్యాష్ బ్యాక్ తన ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అయిన జియో మార్ట్ ద్వారా క్లైం చేసుకోవచ్చని తెలిపింది.
జియో మార్ట్‌ను రిలయన్స్ 2020లో ప్రారంభించింది. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్, దిల్లీ లాంటి నగరాల్లో దీని సేవలను విస్తరించింది. ఇందులో లభించే కిరాణా, రోజువారీ గృహోపకరణాలు, ఫ్యాషన్ ఐటమ్లాంటి వాటిపై మాత్రమే ప్రీపెయిడ్ రీఛార్జ్ ద్వారా వచ్చిన 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
క్యాష్‌బ్యాక్ ఎలా వస్తుంది?
రీఛార్జ్‌పై వచ్చిన 20 శాతం క్యాష్‌బ్యాక్.. యూజర్ జియోమార్ట్ ఖాతాకు పాయింట్ల రూపంలో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ ఆఫర్‌ను క్లైం చేసుకోవాలి అంటే మాత్రం రీఛార్జ్ చేసిన మొబైల్ నంబర్‌తోనే జియోమార్ట్ యాప్‌లో లాగ్ఇన్ కావాల్సి ఉంటుంది.
క్యాష్‌బ్యాక్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు..?
రీఛార్జ్ ద్వారా వచ్చిన క్యాష్‌బ్యాక్‌ను ఈ కింద పేర్కొన్న వాటిలో కూడా క్లైం చేసుకోవచ్చు..