తెలంగాణ

telangana

ETV Bharat / business

Jio New Plans: జియో వినియోగదారులకు మరో షాక్​ - జియో కొత్త రేట్లు

Jio New Plans: టెలికాం దిగ్గజం జియో.. వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో రూ.499కే ప్రారంభమైన డిస్నీ హాట్​స్టార్​ ప్లాన్లు.. రూ.601కు పెంచింది. మిగతా ప్లాన్స్ ఎంత పెరిగాయంటే..?

Jio New Plans
జియో ప్లాన్లు

By

Published : Dec 7, 2021, 7:17 AM IST

Jio New Plans: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో యూజర్లకు మరో షాకిచ్చింది. ఇటీవలే ప్రీపెయిడ్‌ ప్లాన్లను సవరించిన ఆ కంపెనీ.. తాజాగా డిస్నీ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ బండిల్డ్‌ ప్లాన్ల ధరలను కూడా పెంచింది. గతంలో రూ.499కే ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు ఇకపై రూ.601 నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే యూజర్లపై దాదాపు 20 శాతం అదనపు భారం పడనుందన్నమాట.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌, 3జీబీ హైస్పీడ్‌ డేటాతో పాటు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ ధరను జియో రూ.601కి పెంచింది. గతంలో ఈ ప్లాన్‌ ధర రూ.499గా ఉండేది. ఈ ప్యాక్‌లో 6 జీబీ హైస్పీడ్‌ డేటాను అదనంగా అందిస్తున్నారు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అలాగే, గతంలో రూ.666కి లభించే ప్లాన్‌ ధరను రూ.799 చేశారు.

ఈ ప్లాన్‌లో డిస్నీ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఇదే తరహాలో 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన రూ.888 ప్లాన్‌ను రూ.1,066కు (రోజుకు 2జీబీ డేటా, 5జీబీ అదనపు డేటా) పెంచారు.

365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న రూ.2,599 ప్లాన్‌ ధరను రూ.3,119కు (రోజుకు 2జీబీ డేటా, 10 జీబీ అదనపు డేటా) సవరించారు. 1.5 జీబీ రోజువారీ డేటాతో 56 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్‌ ధరను రూ.549 నుంచి 659కి పెంచారు.

ఇదీ చూడండి:శాటిలైట్​ ఇంటర్నెట్​​ కనెక్షన్​ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details