టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు వినియోగదారులు సెప్టెంబరు నెలలో 1.9 కోట్ల వైర్లెస్ సబ్‌స్ర్కైబర్లు తగ్గినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. దీంతో ఆ నెలలో 4.29 శాతం యూజర్‌బేస్‌ను కోల్పోయి.. మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 42.48 కోట్లకు(reliance jio total subscriber) చేరింది.
అదే నెలలో ప్రత్యర్థి ఎయిర్‌టెల్‌కు కొత్తగా 2.74 లక్షల మంది కొత్త యూజర్లు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. దీంతో ఆగస్టునెలలో 35.41 కోట్ల మంది ఉన్న యూజర్ల సంఖ్య సెప్టెంబరులో 35.44 కోట్లకు పెరిగింది. ఫలితంగా 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌ను సొంతం చేసుకుంది.
అయితే మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా సెప్టెంబరు నెలలో 10.7 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫలితంగా యూజర్‌బేస్ 26.99 కోట్లకు తగ్గిపోయింది.