రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, నెలకు అధికవేగం 2 జీబీ డేటా.. తదుపరి పరిమితవేగంతో అపరిమిత డేటా, సరికొత్త జియోఫోన్ కూడా కలిపి రూ.1,999కి ఇవ్వనున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం ప్రకటించింది. ఇవే సదుపాయాలు ఏడాది కాలావధికి కావాలనుకుంటే రూ.1,499 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.
జియో ఆఫర్: రూ.1,999కే రెండేళ్లు అపరిమిత కాల్స్ - కొత్త జియోఫోన్ 2021
రిలయన్స్ జియో.. 2021లో మరో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. కేవలం రూ.1,999కే జియోఫోన్తో పాటు రెండేళ్లపాటు అపరిమిత కాల్స్.. నెలకు 2జీబీ డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఏడాది పాటు ఈ సౌకర్యాలు కావాలంటే రూ.1,499 చెల్లించి పొందవచ్చు.
'కొత్త జియోఫోన్ 2021' కింద ప్రకటించిన ఈ ఆఫర్ మార్చి 1 నుంచి రిలయన్స్ రిటైల్, జియో రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. గతంలోనే జియోఫోన్ కొనుగోలు చేసినవారు ఏడాదికి రూ.749 చొప్పున రీఛార్జి చేసుకోవచ్చని తెలిపింది. 'ఇప్పటికీ దేశంలో 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరు అధికఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మా నినాదమైన '2జీ ముక్త్ భారత్' కింద వీరందరినీ 4జీలోకి మార్చేందుకు, నెలవారీ చెల్లింపుల పరంగా మేలు చేయడం కోసం అధికవేగం డేటా, అపరిమిత కాల్స్, ఫోన్ కూడా కలిపి తక్కువ ధరలో ఇస్తున్నామ'ని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. సమాజంలో డిజిటల్ అంతరం తొలగించడమే ధ్యేయంగా ఈ సదుపాయం తెచ్చినట్లు వివరించారు.
ఇదీ చదవండి:ఆసియా కుబేరుల్లో మళ్లీ అగ్రస్థానానికి ముకేశ్ అంబానీ