తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో కొత్త ప్లాన్​- ఏడాది వరకు రోజుకు 3జీబీ డేటా - జియో ఆఫర్​ లేటెస్ట్ న్యూస్​

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో కొత్త రీఛార్జ్ ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాది పాటు అన్​లిమిటెడ్ కాల్స్​, రోజుకు 3 జీబీ 4జీ డేటా సహా మరిన్ని అదనపు ప్రయోజనాలతో కూడిన ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

Jio New offer with Annual pack
వార్షిక ప్లాన్​తో కొత్త ఆఫర్​

By

Published : Jun 29, 2021, 5:26 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో యూజర్లకు మరో సరికొత్త రీఛార్జ్​ ప్లాన్‌ అందుబాటులోకి వచ్చింది. ఏడాది కాలపరిమితి ఉండే ఈ ప్లాన్‌ రూ.3,499కి లభించనుంది.

జియో కొత్త ఆఫర్​

ఫ్లాన్​ వివరాలు..

  • రోజుకు 3జీబీ.. 4జీ డేటా లిమిట్​ (ఏడాది కాలానికి 1095 జీబీ డేటా)
  • రోజులో 3జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత 64కేబీపీఎస్ నెట్ స్పీడ్​
  • వాయిస్‌ కాలింగ్‌ అపరిమితం, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం

అదనపు సదుపాయాలు..

  • డిస్నీ+హాట్​స్టార్ వీఐపీ సబ్​స్క్రిప్షన్ ఉచితం (ఏడాది పాటు)
  • జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌ సేవలను ఉచితంగా పొందొచ్చు

మరో రెండు వార్షిక ప్లాన్లు..

జియో ఇప్పటికే సంవత్సరం వ్యాలిడిటీతో కూడిన రెండు ప్లాన్​లను అందిస్తోంది. రూ.2,599 ప్లాన్​ ద్వారా 365 రోజులపాటు.. రోజుకు 2 జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్​ కాల్స్​, 100 ఎస్ఎంఎస్​లు పొందొచ్చు. 10 జీబీ అదనపు 4జీ డేటా కూడా లభిస్తుంది. డిస్నీ+ హాట్​ స్టార్​ సబ్​స్క్రిప్షన్​ ఏడాది పాటు ఉచితం.

రూ.2,399 ప్లాన్​తో కూడా 365 రోజులపాటు రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్​ కాల్స్, 100 ఎస్​ఎంఎస్​లు పొందొచ్చు. ఇందులో జియో టీవీ, జియో న్యూస్​ సహా ఇతర జియో సర్వీసులను మాత్రమే ఉచితంగా పొందగలుగుతారు.

ఇదీ చదవండి:సెప్టెంబర్​ 10న మార్కెట్లోకి 'గూగుల్​-జియో' స్మార్ట్​ఫోన్​

ABOUT THE AUTHOR

...view details