తెలంగాణ

telangana

ETV Bharat / business

JIO Disney plus Hotstar Plan: డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌ - డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

JIO new recharge plan: రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్‌ ధర రూ.499గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌ కింద పలు జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతోపాటు, ఏడాది కాలపరిమితితో డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

JIO Disney plus Hotstar Plan
JIO Disney plus Hotstar Plan

By

Published : Jan 7, 2022, 8:29 AM IST

JIO Disney Plus Hotstar Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన వినియోగదారుల కోసం కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్లాన్‌ ధర రూ.499గా నిర్ణయించింది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటాను పొందవచ్చు. రోజులో 2జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్‌ వేగం 64kbpsకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి.

డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్లాన్‌

డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌

ఈ ప్లాన్‌ కింద కొత్త వారు వివిధ జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతోపాటు, ఏడాది కాలపరిమితితో డిస్నీ+హాట్‌స్టార్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. గతేడాది ఆగస్టులో జియో ఈ ప్లాన్‌ను పరిచయం చేసింది. అయితే డిసెంబరులో ధరను సవరించి రూ. 601కు పెంచింది. తాజాగా ఈ ప్లాన్‌ ధరను రూ. 499కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:రిలయన్స్ రికార్డ్.. 400 కోట్ల డాలర్ల విదేశీ కరెన్సీ బాండ్లు జారీ

ABOUT THE AUTHOR

...view details