ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో(Jio Subscriber Today) మరోసారి పెద్ద సంఖ్యలో చందాదారులను తన ఖాతాలో వేసుకుంది. జులైలో ఏకంగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 44.32 కోట్ల మంది చందాదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు జులై నెలకు సంబంధించిన సబ్‌స్క్రైబర్ల డేటాను(Telecom Subscribers Trai) టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసింది.
Trai data: ఎయిర్‌టెల్‌కు పెరిగిన చందాదారులు.. వీఐకి మళ్లీ నిరాశే! - largest telecom operator in india
దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా(Largest Telecom Operator in India) రిలయన్స్ జియో(Reliance Jio) నిలిచింది. జులైలో ఏకంగా 65.1 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది జియో. ఎయిర్‌టెల్(Bharti Airtel) సైత తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇక వోడాఫోన్ ఐడియా(Vodafone India) 14.3 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది.
jio airtel vil
జులైకు గాను ఎయిర్‌టెల్‌లో(Airtel Subscribers ) కొత్తగా 19.42 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 35.40 కోట్లకు చేరింది. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా(Vodafone India) 14.3 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ వైర్‌లెస్ చందాదారుల సంఖ్య 27.19 కోట్లుగా నమోదైంది. అలాగే, దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 120.9 కోట్లకు చేరినట్లు ట్రాయ్ తెలిపింది.
ఇవీ చదవండి: