తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోకు భారీగా పెరిగిన కొత్త యూజర్లు - జియో నెట్​వర్క్​

జియో సంస్థకు ఏప్రిల్​ నెలలో 47లక్షల మంది వినియోగదారులు పెరిగారని ట్రాయ్ వెల్లడించింది. మొత్తంగా టెలిఫోన్ సబ్​స్క్రైబర్​ల సంఖ్య 120.3 కోట్లు దాటినట్లు పేర్కొంది.

Jio network
జియో నెట్​వర్క్​

By

Published : Jul 12, 2021, 11:03 PM IST

ఏప్రిల్​ నెలలో జియో సంస్థకు కొత్తగా 47లక్షల మంది వినియోగదారులు పెరిగారని ట్రాయ్​(టెలికాం రెగులేటరీ సంస్థ) వెల్లడించింది. ప్రస్తుతం భారత్​లో మొత్తం టెలిఫోన్ సబ్​స్క్రైబర్​ల సంఖ్య 120.3 కోట్లు దాటినట్లు తెలిపింది.

ట్రాయ్ డేటా ప్రకారం..

  • ఏప్రిల్​ నెలలో జియో సంస్థకు కొత్తగా 47లక్షల మంది వినియోగదారులు పెరిగారు. దీంతో దేశంలో మొత్తం జియో వినియోగదారుల సంఖ్య 42 కోట్ల76 లక్షలకు చేరింది.
  • ఏప్రిల్​లో వొడాఫోన్​ ఐడియా సంస్థ 18లక్షల మంది యూజర్లు కోల్పోయింది. అయితే మార్చి నెలలో మాత్రం 10లక్షల మంది యూజర్లు పెరిగారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 28 కోట్ల19లక్షలకు పడిపోయింది.
  • ఎయిర్​టెల్​కు ఏప్రిల్​లో కొత్తగా 5,10,000 వేల మంది యూజర్లు పెరిగారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 35కోట్ల 29లక్షలకు పెరిగింది.
  • భారత్​లో ప్రస్తుతం టెలిఫోన్ సబ్​స్క్రైబర్​ల సంఖ్య 120.3 కోట్లు దాటింది. గతనెలతో పోల్చితే.. 0.19శాతం పెరిగింది.
  • దేశంలో మొత్తం బ్రాడ్​బ్యాండ్ సబ్​స్క్రైబర్​ల సంఖ్య.. 78కోట్ల 28లక్షలు.
  • మొత్తం బ్రాడ్​బ్యాండ్ సబ్​స్క్రైబర్​లలో 98.8 శాతం మంది ఐదు కంపెనీల వినియోగదారులే.
  • బ్రాడ్​బ్యాండ్ సబ్​స్క్రైబర్​లలో జియో(43కోట్లు)ది తొలి స్థానం కాగా.. ఎయిర్​టెల్​(19కోట్లు), ఐడియా(12కోట్లు), బీఎస్​ఎన్​ఎల్​(24కోట్లు), అత్రియా కన్వర్జెన్సీ(18లక్షలు) ఆ తర్వాత ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details