తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 8:50 AM IST

ETV Bharat / business

దేశంలో ఆభరణాల విక్రయశాలలు ప్రారంభం

కొన్ని రాష్ట్రాల్లో, అనుమతులు లభించిన ప్రాంతా(గ్రీన్‌జోన్‌)ల్లో ఆభరణాల విక్రయాలు ఆరంభమయ్యాయి. సాధారణ రోజులతో పోలిస్తే, 20-25 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోందని.. ధరల పెరుగుదలే ఇందుకు కారణమని ఆలిండియా జెమ్స్ అండ్ జువెలరీ దేశీయ మండలి ఛైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు.

gold
ఆభరణాల విక్రయశాలలు

దేశంలో ఆభరణాల విక్రయాశాలలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో, అనుమతులు లభించిన ప్రాంతా(గ్రీన్‌జోన్‌)ల్లో కార్యకలాపాలు ఆరంభమైనట్లు ఆలిండియా జెమ్స్‌ అండ్‌ జువెలరీ దేశీయ మండలి (జీజేఎఫ్‌) ఛైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే, 20-25 శాతం వ్యాపారం మాత్రమే జరుగుతోందని వివరించారు.

తగ్గిన కొనుగోళ్లు..

వివాహాది శుభకార్యాలకు అత్యవసరమైన వారు మాత్రమే కొంటున్నారని పేర్కొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నవారు కూడా డెలివరీ తీసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 పైన ఉండటం వల్ల కొనుగోళ్లు బాగా తక్కువగా ఉంటున్నాయని వివరించారు.

ఒడిశా, అస్సోం, పుదుచ్ఛేరిలలో ఒక్కోటి, కర్ణాటకలో 7 కలిపి మొత్తం 10 విక్రయశాలలను గత వారంలో తగిన భద్రతా ప్రమాణాలతో పునఃప్రారంభించినట్లు కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కల్యాణ రామన్‌ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాల్లో 34 విక్రయశాలలుండగా, యూఏఈ, ఖతార్‌లలో 13 తెరిచినట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న 328 విక్రయశాలల్లో 50 షోరూమ్‌లను ఆదివారం ప్రారంభిస్తున్నట్లు టాటా గ్రూప్‌ సంస్థ తనిష్క్‌ వెల్లడించింది.

ఇదీ చూడండి:'కోలుకోవాలంటే ప్రస్తుత ప్యాకేజీ సరిపోదు'

ABOUT THE AUTHOR

...view details