తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్ ఎయిర్​వేస్ పైలట్ల సమ్మె వాయిదా - సమ్మె

జెట్ ఎయిర్​వేస్ పైలట్ల సమ్మె వాయిదా పడింది. జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) ఏప్రిల్ 15వరకు సేవల్ని కొనసాగించేందుకు నిర్ణయించింది. దిల్లీ, ముంబయిలో జరిగిన ఎన్​ఏజీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

జెట్ ఎయిర్​వేస్ సమ్మె నిలిపివేతకు పైలట్ల నిర్ణయం

By

Published : Apr 1, 2019, 1:35 AM IST

జీతాలు చెల్లించని కారణంగా సమ్మెకు పిలుపునిచ్చిన జెట్ ఎయిర్​వేస్(ఎన్​ఏజీ) పైలట్లు తమ సమ్మెను వాయిదా వేశారు. ముంబయి, దిల్లీలో జరిగిన జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1100 మంది పైలట్లు, మరో 500 మంది విమాన సిబ్బంది సభ్యులుగా ఉన్న ఎన్​ఏజీ ఏప్రిల్ 1న సమ్మెకు పిలుపునిస్తున్నట్లుగత నెలలో ప్రకటించింది. ఈ ప్రకటనలో మార్చి 31 వరకు జీతాలు చెల్లిస్తేనే సేవల్ని కొనసాగిస్తామని తీర్మానించారు. జెట్ ఎయిర్​వేస్ పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్ మేనేజర్లకు గత ఏడాది ఆగస్టు నుంచి జీతాల్ని చెల్లించాల్సి ఉంది.

మూడునెలల కాలానికి తక్షణ చెల్లింపులు చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది జెట్​ ఎయిర్​వేస్. డిసెంబర్​ వరకు జీతాల్ని చెల్లిస్తామని వెల్లడించింది.

"సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, యాజమాన్యం భారతీయ రుణదాతలతో కుదిరిన అగ్రిమెంట్​ను సాధ్యమైనంత త్వరలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. దీనిద్వారా సంస్థకు స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది." -వినయ్ దూబే, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జెట్ ​ఎయిర్​వేస్

రోజువారీ కార్యక్రమాలలో జోక్యం వీలుపడదు..!

విమానయాన సంస్థల రోజువారీ కార్యక్రమాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని పౌరవిమానయాన మంత్రి సురేశ్ ప్రభూ వెల్లడించారు. సమర్థవంతమైన కార్యకలాపాలు, ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడం సంస్థ వ్యక్తిగత బాధ్యతన్నారు. దేశీయ విమానయాన సంస్థ అనేకసార్లు ఒడుదొడుకులకు లోనయిందని పేర్కొన్నారు.

పెరుగుతున్న ఖర్చులు, పైలట్ల కొరత, విమానాలు దించేందుకు రన్​వే వంటి అంశాలు దేశీయ విమానయాన రంగానికి సమస్యలుగా మారాయన్నారు. ప్రభుత్వ పరిధిలోని అంశాలపై తగు చర్యలు చేపడతామని సురేశ్​ ప్రభూ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details