ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ 'అమెజాన్' (amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(jeff bezos) సీఈఓ పదవి నుంచి తప్పుకునే తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన బెజోస్.. అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ అధిపతిగా ఉన్న ఆండీ జాస్సీ(andy jassy) జులై 5న సీఈఓ పదవిని చేపట్టనున్నట్లు తెలిపారు.
బుధవారం అమెజాన్(amazon) వాటాదారుల సమావేశం జరిగింది. 1994లో సంస్థను స్థాపించిన జులై 5 తనకు సెంటిమెంట్ అని అందుకే ఆ తేదీని ఎంచుకున్నట్లు బెజోస్(jeff bezos) వెల్లడించారు. సీఈఓ పదవి నుంచి బెజోస్ తప్పుకోనునున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అమెజాన్ కార్పొరేషన్ ప్రకటించింది.
ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా కొనసాగింపు..