ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆరు వారాలుగా అగ్రస్థానంలో ఉంటున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద ఒక్కసారిగా 4.6 బిలియన్ డాలర్లు తగ్గడం వల్ల బెజోస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. టెస్లా షేర్లు మంగళవారం 2.4 శాతం పడిపోవడం మస్క్ సంపద తగ్గేందుకు కారణం.
బ్లూమ్బర్గ్ తాజా నివేదిక ప్రకారం బెజోస్ సంపద 191.2 బిలియన్ డాలర్లు.