ప్రపంచ అపరకుబేరుడు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరో కొత్త రికార్డు నెలకొల్పారు. ఒక్క రోజులోనే (సోమవారం) బెజోస్ సంపద 13 బిలియన్ డాలర్లు (రూ.97 వేల కోట్ల పైమాటే) పెరిగింది.
అమెరికా స్టాక్ మార్కెట్లలో అమెజాన్ షేర్లు జులై 20న దాదాపు 8 శాతం పెరిగి 3,196.84 డాలర్ల (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది. దీనితో బెజోస్ సంపద ఈ స్థాయిలో వృద్ధి చెందింది.
సంక్షోభంలోనూ వృద్ధే..
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ సంపద ఈ ఏడాది ఇప్పటి వరకు 74 బిలియన్ డాలర్లు పెరిగి.. 189.3 బిలయన్ డాలర్లకు (రూ.14 లక్షల కోట్లకుపైమాటే) చేరింది. ఇప్పటికే బెజోస్ ప్రపంచ ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్నారు.