తెలంగాణ

telangana

ETV Bharat / business

కరెంట్​ బిల్ రూ.లక్ష దాటితే ఐటీ రిటర్న్ మస్ట్​ - govt makes mandatory disclosure of electricity bill exceeding Rs 1L

కరెంటు బిల్లు రూ.లక్ష దాటితే కచ్చితంగా ఐటీ రిటర్ను దాఖలు చేయాలని తెలిపింది ఆదాయ పన్ను శాఖ. 2019-20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుకు ఫారాలను నోటిఫై చేసింది.

govt makes mandatory disclosure of electricity bill exceeding Rs 1L
బిల్లు రూ.లక్ష దాటితే ఐటీ రిటర్ను దాఖలు చేయాల్సిందే

By

Published : May 31, 2020, 6:02 PM IST

2019-20 ఆదాయ పన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేసేందుకు కావాల్సిన ఫారాలను విడుదల చేసింది ఆదాయపు పన్ను శాఖ (ఐటీ). సహజ్ (ఐటీఆర్-1), ఫారం ఐటీఆర్​-2, ఫారం ఐటీఆర్​-3, ఫారం సుగమ్ (ఐటీఆర్-4), ఫారం ఐటీఆర్​-5, ఫారం ఐటీఆర్-6, ఫారం ఐటీఆర్-7, ఫారం ఐటీఆర్​-Vలను 2020-21 మదింపు సంవత్సరానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) నోటిఫై చేసింది. కరెంటు బిల్లు రూ. లక్ష దాటితే తప్పనిసరిగా ఐటీ రిటర్ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కరెంటు ఖాతా డిపాజిట్లు రూ.కోటి దాటినా రిటర్ను దాఖలు చేయడాన్ని తప్పని సరి చేసింది.

కరోనా కారణంగా కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లు, ప్రయోజనాలను పన్ను చెల్లింపుదారులకు అందించేందుకు ఐటీ ఫారార్లో మార్పులు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని వేర్వేరు కాలపరిమితులను పొడిగించింది కేంద్రం. ప్రత్యేక ఆర్డినెన్సు 2020 ద్వారా ఈ మార్పులు చేసింది. దీని ప్రకారం చాప్టర్​-వీఐఏ-బీ ద్వారా పెట్టుబడులు, ఇతర చెల్లింపులు, సెక్షన్ 80 సీ(ఎల్​ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎస్​సీ..) 80 డీ (మెడిక్లెయిమ్), 80 జీ (విరాళాల) ప్రయోజనాలు పొందేందుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించింది.

ఐటీ రిటర్ను ఫారాల్లోని కీలక మార్పులు..

  • కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ. కోటి దాటితే వివరాలు కచ్చితంగా తెలియజేయాలి.
  • కరెంటు బిల్లు రూ.లక్ష దాటితే రిటర్ను దాఖలు చేయాలి.
  • విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.2లక్షలు దాటితే వివరాలు తెలపాలి.
  • పన్ను ఆదా పెట్టుబడులు, విరాళాలకు సంబంధించిన వివరాలను 2019-20, 2020 జూన్​కు గాను వేర్వేరుగా సమర్పించాలి.

ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4ల ప్రయోజనం ఒక సంస్థలో డైరెక్టర్‌ లేదా, జాబితాలో లేని ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు పొందలేరని నంగియా అండర్సన్ కన్సల్టింగ్​ డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఏ ఫారం ఎంచుకోవాలనే విషయంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేంద్రం నిర్ణయంతో గృహ ఆస్తుల సంయుక్త యజమానులకు ఉపశమనం లభిస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్​ పార్ట్​నర్​ అమిత్ మహేశ్వరి అన్నారు. ఎక్కువ ఖర్చు చేసే వారు సహజ్​, సుగం ఫారాలను ఉపయోగించవచ్చని.. ఇవి సులభంగా ఉంటాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details