It sector spending: దేశీయంగా, అంతర్జాతీయంగా పలు రంగాల్లో చోటుచేసుకుంటున్న డిజిటలీకరణ, క్లౌడ్‌కు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల మార్పు వల్ల, ఐటీ వ్యయాలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయికి 2022లో చేరనున్నాయని పరిశోధనా సంస్థ గార్ట్‌నర్ అంచనా వేస్తోంది. ఇది భారత ఐటీ కంపెనీలకు కలిసొచ్చే పరిణామంగా తెలిపింది. వచ్చే మూడేళ్ల కాలం ఐటీ సేవల కంపెనీలకు భారీ అవకాశాలు లభిస్తాయనీ, అందుకే లక్ష్యాలను మించి ఫ్రెషర్లకు కంపెనీలు అవకాశాలిస్తున్నాయని పేర్కొంది.
India it spend: దేశీయంగా ఐటీ వ్యయాలు వచ్చే ఏడాది సుమారు రూ.7.63 లక్షల కోట్ల (101.8 బిలియన్ డాలర్ల)కు చేరొచ్చన్నది సంస్థ అంచనా. 2020తో పోలిస్తే ఐటీ వ్యయాలు 2021లో 10.8 శాతం అధికమవుతున్నాయని, దీనితో పోలిస్తే 2022లో 7 శాతం పెరుగుతాయన్నది సంస్థ అంచనా. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగానికి అధిక వృద్ధి లభిస్తుందని, ఇందుకనుగుణంగా నియామకాలు జరుగుతాయని వివరించింది. కొవిడ్ ముందుతో పోలిస్తే, దాదాపు రెట్టింపు వ్యయాలు 2022లో సాఫ్ట్‌వేర్‌పై జరుగుతాయని పేర్కొంది. ఇందువల్ల ఫ్రెషర్లకు భారీ అవకాశాలు లభిస్తాయని తెలిపింది. అయితే క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా అనుభవజ్ఞులను నియమించుకునేందుకు సంస్థలు అధిక వ్యయాలు చేయాల్సి వస్తుందని పేర్కొంది. వారంలో కొన్ని రోజులు కార్యాలయానికి వచ్చి, మరికొన్నిరోజులు ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం కొనసాగుతుంది కనుక, హార్డ్‌వేర్ పరికరాల కొనుగోళ్లు అధికమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ఐటీ వ్యయాల్లో 43 శాతం వాటా పరికరాలదే ఉంటుందని సంస్థ విశ్లేషిస్తోంది.
లక్ష్యాలకు మించి నియామకాలు
Campus placement it jobs: 2021-22కు ఐటీ సంస్థలు ముందుగా వేసుకున్న అంచనాలకు మించి కళాశాల ప్రాంగణాల్లో ఎంపికలు చేయనున్నాయి.
- టీసీఎస్:43,000 మందిని నియమించుకోవాలన్నది ప్రణాళిక. ఇప్పటికే పూర్తిచేసింది. మరో 35,000 మందిని ఎంపిక చేయనుంది.
- ఇన్ఫోసిస్:35,000 నియామకాలు తొలి ప్రణాళిక. అదనంగా 10,000 మందిని నియమించుకోనుంది.
- హెచ్‌సీఎల్ టెక్:2022-23కు 30,000 మంది ఫ్రెషర్లను నియమించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000-22,000 మందిని ఎంపిక చేస్తోంది.
ఇదీ చూడండి:బ్యాంక్ ఉద్యోగుల రెండు రోజుల సమ్మె.. ఈ తేదీల్లో...
అంతర్జాతీయ కంపెనీల నుంచీ..