ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ-అసెస్‌మెంట్ పథకం కింద 44 వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు జారీ అయ్యాయి. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ అసెస్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిని గత అక్టోబర్‌లో ప్రారంభించారు.
44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు - E-Assessment scheme
ఆదాయ పన్నుశాఖ ఈ-అసెస్‌మెంట్ పథకం కింద 44,285 మందికి నోటీసులు జారీ చేసింది. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఇది తోడ్పడుతుంది.
![44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు IT issues notes to 44 thousand tax payers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5805526-thumbnail-3x2-income-tax.jpg)
44వేల మందికి ఆదాయపు పన్ను నోటీసులు
దీనిలో గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను రిటర్నుల పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు , అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ''సాంకేతికతను ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాం'' అని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ-అసెస్‌మెంట్ ప్రయోజనాలు
- సెంట్రలైజ్‌డ్ ఈ అసెస్‌మెంట్ సెంటర్ నుంచి పన్ను చెల్లింపుదారులకు అందే నోటీసులకు డిజిటల్ విధానాలోనే సమాధానలు ఇవ్వాలి.
- పన్ను చెల్లింపుదారులను టెక్ట్స్ మెసేజీల రూపంలో కూడా అప్రమతం చేస్తారు. పన్ను చెల్లింపుదారులు తమ సమాధానాలను ఈమెయిల్ రూపంలో కూడా పంపించవచ్చు.
- వ్యక్తులు, అధికారుల జోక్యం గణనీయంగా తగ్గిపోతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తగ్గుతుంది.
- ఈ విధానంలో కేసులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ఈ అసెస్‌మెంట్ సెంటర్లకు పంపిస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ విధానంలో జరుగుతాయి. ఇది పారదర్శకత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అధికమొత్తంలో అంచనాలు, పేచీలు తగ్గుతాయి.
- ఈ పథకం కింద జాతీయ ఈ అసెస్‌మెంట్ సెంటర్ ఆదాయపుపన్ను శాఖ కింద ప్రాంతీయ ఈ అసెస్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది.
Last Updated : Feb 18, 2020, 1:30 AM IST