మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో తీసుకువచ్చిన పిక్సెల్ 3 శ్రేణి ఫోన్లకు గుడ్‌బై చెప్పింది గూగుల్. త్వరలో పిక్సెల్ 4ఏ విడుదలవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తమ స్టోర్లలోనూ పిక్సెల్ 3 శ్రేణి ఫోన్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది గూగుల్. అయితే థర్డ్ పార్టీ స్టోర్లలో మాత్రం.. స్టాక్ అయిపోయే వరకు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.
నిజానికి పిక్సెల్ 3ఏ నిలిపివేతతోనే.. పిక్సెల్ 3 శ్రేణి ఫోన్ల ప్రస్థానం ముగిసింది. ఈ ఏడాది మార్చి నుంచి పిక్సెల్ 3, 3 ఎక్స్ఎల్లను నిలిపివేసింది సంస్థ. ప్రస్తుతం గూగుల్‌కు చెందిన ఫోన్లలో పిక్సెల్ 4, 4 ఎక్స్ఎల్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.