తెలంగాణ

telangana

ETV Bharat / business

నెలరోజుల వరకు రైలు, విమాన ప్రయాణాలు కష్టమే! - రైలు, విమాన ప్రయాణాలపై లాక్​డౌన్​ ఎఫెక్ట్​

రాబోయే నెలరోజుల్లో ఎలాంటి ప్రయాణాలకు సిద్ధంగా లేమని 76 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఓ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. లాక్​డౌన్​ సడలింపుల తర్వాత కరోనా కేసులు పెరగడమే అందుకు కారణమని పేర్కొంది. అయితే ప్రస్తుతం రైలు, విమాన ప్రయాణాలు చేస్తున్న వారిలో అధికంగా లాక్​డౌన్​ వల్ల వేరే ప్రాంతాల్లో చిక్కుకున్నవారేనని సర్వే తెలిపింది.

It is doubtful that the plane and train will board in the coming months
నెలరోజుల వరకు రైలు, విమాన ప్రయాణాలు కష్టమే!

By

Published : May 27, 2020, 8:24 AM IST

ఈనెల 25 నుంచి దేశీయంగా విమాన సర్వీసులు ప్రారంభమైనా, జూన్‌ 1 నుంచి 200 రైళ్లు నడవబోతున్నా.. రాబోయే నెలరోజుల్లో ప్రయాణానికి సిద్ధంగా లేమని 76 శాతం మంది చెబుతున్నారని లోకల్‌సర్కిల్స్‌ అనే సంస్థ చెబుతోంది. దేశంలో రోజూ 7,000 కరోనా కొత్త కేసులు నమోదవుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇప్పుడు ప్రయాణిస్తున్న వారిలో అత్యధికంగా లాక్‌డౌన్‌ వల్ల వేరే ప్రాంతాల్లో 2 నెలలుగా చిక్కుకుపోయిన వారేనని వివరించింది.

దేశంలోని 212 జిల్లాల్లో 16,000 మంది నుంచి సమీకరించిన వివరాలతో ఈ సంస్థ నివేదిక రూపొందించింది. ఇందులో 71 శాతం మంది పురుషులు, 29 శాతం మంది మహిళలు ఉన్నారు. నగరాల నుంచి 49శాతం మంది, రెండో అంచె పట్టణాల నుంచి 34 శాతం మంది, 3-4 అంచె పట్టణాల నుంచి 17 శాతం మంది తమ మనోభిప్రాయం తెలిపారు. ఈ ప్రకారం..

  • విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నామని, అతిత్వరలో ప్రయాణిస్తామని చెప్పినవారు.. 10 శాతం మంది
  • త్వరలో టికెట్లు బుక్‌ చేసుకుంటామని తెలిపిన వారు.. 11 శాతం మంది
  • రైళ్లలో ప్రయాణానికి ఎటువంటి ప్రణాళిక లేని వారు.. 88 శాతం మంది
  • టికెట్లు కొనుగోలు చేశాం, ప్రయాణిస్తాం అన్నవారు.. 4 శాతం మంది
  • త్వరలో టికెట్లు బుక్‌ చేస్తాం అన్నవారు.. 6 శాతం మంది

ఇదీ చూడండి... చైనా స్థాయిలో భారత్​లో ఇంధన గిరాకీ పెరిగేది ఎప్పుడు?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details