తెలంగాణ

telangana

ETV Bharat / business

'పాన్​' లేకుండా... 'ఈ-అసెస్మెంట్​' కుదరదు: సీబీడీటీ - ఇ-అసెస్మెంట్​ సిస్టమ్

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇకపై ఈ-ఫైలింగ్ ఖాతా, పాన్ కార్డు లేకుండా ఇ-అసెస్మెంట్​ సిస్టమ్​లోకి ప్రవేశించలేరు. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే ఈ నూతన విధానంలో ఈ మేరకు కీలక మార్పులు చేసినట్లు సీబీడీటీ స్పష్టం చేసింది.

'పాన్​' లేకుండా... 'ఈ-అసెస్మెంట్​' కుదరదు: సీబీడీటీ

By

Published : Sep 27, 2019, 11:56 PM IST

Updated : Oct 2, 2019, 7:20 AM IST

ఆదాయపు పన్ను శాఖ ఈ-అసెస్మెంట్​​ సిస్టమ్​లో కీలక మార్పులు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. అక్టోబర్​ 8న ప్రారంభం కాబోయే ఈ విధానంలో ఇ-ఫైలింగ్ ఖాతా, పాన్​ నెంబర్​ లేనివారు ఈ-అసెస్మెంట్​ సిస్టమ్​లోకి ప్రవేశించలేరని స్పష్టం చేసింది.

ఐటీ దాడుల్లో కేసులు నమోదైనవారు, అసాధారణ పరిస్థితుల్లో... 'ఫేస్​లెస్​ అసెస్మెంట్ సిస్టమ్​' పరిధిలోకిరారని సీబీడీటీ వెల్లడించింది.
సీబీడీటీ... ఆదాయపు పన్నుశాఖకు చెందిన పాలసీలను రూపొందిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఈ-అసెస్మెంట్​లోని మినహాయింపులు తెలుపుతూ గురువారం సర్క్యులర్ విడుదల చేసింది.ట్రాయ్​: 'పోర్టబిలిటీ' అమలు గడువు పొడిగింపు

వీరికి మినహాయింపులు..

పేపర్​ మోడ్​లో ఆదాయపు పన్ను రిటర్న్​లు (ఐటీఆర్) దాఖలు చేసిన కేసుల్లో... ఈ-ఫైలింగ్​ ఖాతా, పాన్​ నెంబర్​లేని ఆదాయపు పన్ను చెల్లింపుదారుల విషయంలో... కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని సీబీడీటీ స్పష్టం చేసింది. పాలనాపరమైన ఇబ్బందులు, సంక్షిష్ట కేసులు, కొన్ని అసాధారణ పరిస్థితులు ఉన్న సందర్భాల్లో... ఈ కొత్త వ్యవస్థ నుంచి మినహాయింపులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఐటీ దాడులు-శోధన జరుగుతున్న కేసుల్లో, విచారణ జరుగుతున్న మునుపటి కేసుల విషయంలోనూ మినహాయింపులు వర్తిస్తాయని సీబీడీటీ పేర్కొంది.

ఇలా చేయాలి..

ఈ-అసెస్మెంట్ సిస్టమ్​ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్​లు దాఖలు చేసేవారు... కమ్యునికేషన్ లేదా అసెస్సింగ్ అధికారి (ఏఓ) జారీ చేసిన ఏదైనా నోటీసుకు... తగిన ఆధారాన్ని, తమ స్పందనను ఎలక్ట్రానిక్ విధానంలో ఇ-ఫైలింగ్ ఖాతా ద్వారా అందజేయాలి.

ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం డాక్యుమెంట్​ ఐడెంటిఫికేషన్​ నంబర్​ (డీఐఎన్​) ను ఇటీవలే ప్రారంభించింది ఆదాయపన్ను శాఖ.

వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి రావచ్చు

ఈ-అసెస్మెంట్​ కేసుల్లో పన్ను చెల్లింపుదారులు కొన్ని సార్లు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి రావచ్చని సీబీడీటీ స్పష్టం చేసింది.

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల కోసం 'ఫేస్​లెస్ అసెస్మెంట్ సిస్టమ్​' ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జాతీయ ఈ-అసెస్మెంట్​ సెంటర్​ను దిల్లీలో ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి:ట్రాయ్​: 'పోర్టబిలిటీ' అమలు గడువు పొడిగింపు

Last Updated : Oct 2, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details