తెలంగాణ

telangana

ETV Bharat / business

పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్ - ఐటీఆర్​ దాఖలు

వచ్చే నెల 7న కొత్త ఈ-ఫైలింగ్​ పోర్టల్​ను ప్రారంభించనున్నట్లు తెలిపింది ఆదాయ పన్ను శాఖ. దీని ద్వారా వ్యక్తిగత, వ్యాపారాల ఐటీఆర్​ దాఖలుతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో పాత పోర్టల్​ ఆరు రోజుల పాటు పని చేయదని స్పష్టం చేసింది.

IT Dept
ఆదాయపన్ను శాఖ

By

Published : May 20, 2021, 1:57 PM IST

పన్ను చెల్లింపు దారులకు మరింత చేరుయ్యేందుకు కొత్త ఈ-ఫైలింగ్​ వెబ్​ పోర్టల్​ను తీసుకొస్తోంది ఆదాయపన్ను శాఖ. దీన్ని జూన్​ 7న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ పోర్టల్​ ద్వారా సాధారణ ఐటీఆర్​ దాఖలు సహా ఇతర పన్ను సంబంధిత పనులు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వెబ్​ పోర్టల్​ జూన్​ 1 నుంచి 6 వరకు ఆరు రోజుల పాటు పని చేయదని స్పష్టం చేసింది. కొత్త పోర్టల్​ వినియోగదారులకు మరింత సులభంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆదాయ పన్ను శాఖలోని సిస్టమ్స్​ విభాగం ఈ అంశంపై ఆదేశాలు ఇచ్చింది. పాత పోర్టల్​ www.incometaxindiaefiling.gov.in నుంచి కొత్త పోర్టల్​ www.incometaxgov.in కు మార్పు త్వరలోనే పూర్తవుతుందని, జూన్​ 7వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

"కొత్త పోర్టల్​ ప్రారంభించే ప్రక్రియలో బాగంగా పాత పోర్టల్​ జూన్​ 1 నుంచి 6 వరకు అందుబాటులో ఉండదు. పన్ను చెల్లింపుదారులతో పాటు ఆదాయపన్ను విభాగం అధికారులు సైతం పాత పోర్టల్​ను యాక్సెస్​ చేయలేరు. ఈ సమయంలో టాక్స్​పేయర్స్​, అధికారుల మధ్య ఏదైన పని ఉంటే అది ముందే ముగించటం లేదా వాయిదా వేయటం జరుగుతుంది."

-సిస్టమ్స్​ విభాగం, ఐటీ శాఖ

ఈ-ఫైలింగ్​ పోర్టల్​ ద్వారా వ్యక్తిగత, వ్యాపార ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయవచ్చు. రిఫండ్స్​ గురించి ఫిర్యాదులు చేయవచ్చు. అలాగే.. ఐటీ శాఖతో ఇతర పనులేమైనా ఉన్నా చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:ఐటీ ఈ-ఫైలింగ్​ ఖాతా హ్యాక్ అయిందా?

ABOUT THE AUTHOR

...view details