తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎలక్ట్రిక్​ బైక్​, కార్​ కొంటున్నారా? ఈ సబ్సిడీలు మిస్​ కావద్దు! - విద్యుత్​ వాహనాలపై రాయితీలు

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ కాకుండా.. మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో ఆ దిశగా ఏమైన చర్యలు ఉన్నాయా?

subsidy for E-vehicle
విద్యుత్​ వాహనాలపై రాయితీలు

By

Published : Aug 14, 2021, 5:05 PM IST

Updated : Aug 14, 2021, 5:15 PM IST

పెట్రోలు, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉంటాయి. పెట్రో ధరల మోతతోపాటు నిర్వహణ, ఇతర కారణాలతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నప్పటికీ అధిక ధరలను చూసి ఆగిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు..

ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2(ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్) పథకం ప్రకారం సబ్సిడీలను అందిస్తోంది. ప్రస్తుతం నిర్ణయించిన దాని ప్రకారం 2024 మార్చి 31 వరకు ఈ సబ్సిడీలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా కిలోవాట్ అవర్ బ్యాటరీపై రూ. 10వేల వరకు సబ్సిడీ పొందొచ్చు. వాహనం ధరలో 40 శాతం వరకు గరిష్ఠ సబ్సిడీ పొందవచ్చు.

వివిధ రాష్ట్రాల్లో రాయితీ..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలకు తోడు మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలను అందిస్తున్నాయి. వీటి వల్ల ధరలు ఆయా రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉంటున్నాయి. గుజరాత్​లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో రూ. 20వేల వరకు, కార్ల విషయంలో రూ.1.5 లక్షల వరకు రాయితీ లభిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో…

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు విధానాలను ప్రకటించాయి. తెలంగాణ ఈవీ విధానం ప్రకారం రాష్ట్రంలో విక్రయం, రిజిస్టర్​ అయిన మొదటి 2 లక్షల విద్యుత్ ద్విచక్ర వాహనాలు విషయంలో 100 శాతం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంది.

కేవలం ద్విచక్ర విద్యుత్ వాహనాలకే కాకుండా ఇతర వాహనాలకు కూడా సబ్సిడీ అందిస్తోంది. తెలంగాణలో కొనుగోలు, రిజిస్టర్ అయిన మొదటి 20వేల ఆటోలకు 100 శాతం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉండనుంది. పాత ఆటోలను ఎలక్ట్రిక్ రూపంలోకి మార్చినట్లయితే వాహనానికి రూ.15వేలు ఈ ఖర్చు గరిష్ఠ ఖర్చుగా పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది మొదటి 5వేల వాహనాలను లభించనుంది.

కార్ల విషయంలో ట్యాక్సీ, టూరిస్ట్ క్యాబ్​ల తదితర మొదటి 5వేల వాణిజ్య వాహనాలకు వంద శాతం రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉండనుంది. వ్యక్తిగత కార్ల విషయంలో మొదటి 5వేల వాహనాలకు 100 శాతం రిజిస్ట్రేషన్, రహదారి పన్ను మినహాయింపు ఉంది. బస్సులు, ట్రాక్టర్ల విషయంలో కూడా మినహాయింపులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్​లో ప్రత్యక్షంగా వినియోగదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రోత్సాహకాలు ఇంకా ప్రకటించలేదు. కానీ డిమాండ్ సృష్టించేందుకు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వాటికి పలు రకాల రాయితీలు ఇచ్చింది.

ఇదీ చూడండి:2021లో హవా అంతా ఎలక్ట్రిక్​ కార్లదే!

Last Updated : Aug 14, 2021, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details