Guaranteed Income Plan: పాలసీని ఎంచుకునేటప్పుడే జీవిత బీమా రక్షణతో పాటు, వ్యవధి తీరాక ఎంత మొత్తం చెల్లిస్తామనే హామీతో వస్తున్న పథకాలే 'గ్యారంటీడ్ ఇన్‌కం స్కీం'లు. పేరులోనే ఉన్నట్లు ఇవి రాబడికి హామీ ఇస్తాయి. అన్ని రకాల నష్టభయాలకు ఇవి పరిష్కారం చూపిస్తాయి. నష్టభయం ఏమాత్రం భరించలేని వారు.. పాలసీ కొనసాగుతున్నన్ని రోజులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పని చెల్లింపులు, వ్యవధి పూర్తయ్యాక ప్రీమియాలను వెనక్కి ఇచ్చే తరహా పాలసీలను ఎంచుకోవచ్చు. కాస్త నష్టభయం భరించేవారు.. పెట్టుబడుల జాబితాలో నష్టభయం ఉండే పథకాలతోపాటు, రాబడి హామీ పథకాలను కలిపి ఎంచుకోవాలి. దీనివల్ల కొంచెం అధిక రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.
ఆదాయ లోటు భర్తీ
పదవీ విరమణ తర్వాత ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి, సంపాదించేటప్పుడే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి ఈ రాబడి హామీ పథకాలు నప్పుతాయి. మీ ప్రాథమిక ఆదాయానికి ఇవి తోడుగా ఉండి, కుటుంబ అవసరాలను తీరుస్తాయని చెప్పొచ్చు. ఫలితంగా మీపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా
మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు, మీ అవసరాలు తీర్చే విధంగా ఈ పాలసీలను తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి, చెల్లింపులు ఎలా చేస్తారు అనే దగ్గర్నుంచి, బీమా సంస్థలు తిరిగి చెల్లించేటప్పుడు ఏ విధంగా ఆదాయం అందుకోవాలి అనే వరకు అన్నీ మీ ఇష్టానుసారమే ఎంచుకోవచ్చు. కొన్నాళ్ల తర్వాతే ఆదాయం వచ్చేలా పాలసీలో మార్పు చేసుకోవచ్చు. దీనివల్ల అవసరాలు ఉన్నప్పుడే ఆదాయం అందుకోవచ్చు. పిల్లల చదువులు, వారి వివాహం తదితర లక్ష్యాలకు ఇవి తోడ్పడతాయి.
ఎలా పనిచేస్తుంది?
రాబడి హామీ పథకాన్ని ఎంచుకున్నప్పుడు.. మీరు ముందుగా ఎన్నేళ్లు ప్రీమియం చెల్లించగలరో చూసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటి నుంచి మీకు ఆదాయం రావాలి అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడు పాలసీదారుడి వయసు ఆధారంగా ఎంత ఆదాయం, ఎప్పటి నుంచి కావాలి అనేది చూసి, పాలసీ విలువ ఎంత ఉండాలనేది లెక్కిస్తారు. ఆ పాలసీలో ఉండే వెసులుబాట్లను బట్టి, ఆదాయం లభిస్తుంది. కొన్ని పాలసీల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొన్నింటిలో నిర్ణీత వ్యవధుల్లో ఆదాయం కొంత శాతం పెరుగుతూ ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే దీన్ని ఎంచుకోవాలి.
అదనపు ఖర్చులు: