తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిరిండియాలో 100 శాతం ఎఫ్​డీఐలకు అనుమతి! - ఎయిరిండియా

ఎయిరిండియాలో ఎఫ్​డీఐల పరిమితి ప్రస్తుతం 49శాతం ఉండగా ఎంపిక చేసిన స్వదేశీ మార్గాల్లో వంద శాతం అనుమతించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. కేంద్రం నిర్ణయం ద్వారా ప్రవాస భారతీయులకు కూడా ఎయిరిండియాలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశం లభించనుంది.

Is 100 per cent FDI allowed in Airindia?
ఎయిరిండియాలో 100 శాతం ఎఫ్​డీఐలకు అనుమతి?

By

Published : Feb 4, 2020, 7:34 PM IST

Updated : Feb 29, 2020, 4:30 AM IST

తీవ్రనష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమాన సంస్ధ ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఎయిరిండియాలో ఎఫ్​డీఐల పరిమితి ప్రస్తుతం 49 శాతం ఉండగా ఎంపిక చేసిన స్వదేశీ మార్గాల్లో వంద శాతం అనుమతించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేంద్ర నిర్ణయం ద్వారా ప్రవాస భారతీయులకు కూడా ఎయిరిండియాలో వంద శాతం పెట్టుబడులు పెట్టే అవకాశం లభించనుంది.

ఇదీ చూడండి: 'కార్పొరేట్లకు సహకరిస్తేనే వృద్ధి గాడిలో పడుతుంది!'

Last Updated : Feb 29, 2020, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details